పిట్టగూడు మాస్క్ | మేకలను కాసుకునే ఈ తాత.. చేనులో కనబడిన పిట్టగూడునే మాస్క్‌గా మార్చుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునగల్చేడ్కు చెందిన కుర్మన్న అనే ఈ తాత ధరించ�
నైట్ కర్ఫ్యూ | కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
70 ఏండ్ల చరిత్ర గల ఎగువ మానేరు సరికొత్త చరిత్ర లిఖించుకున్నది. వేసవిలో గోదావరి జలాలు ఎదురెక్కి రావడంతో ఎగువ మానేరు నిండి పరవళ్లు తొక్కుతున్నది.
ఎప్పుడూ ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం కనిపించిందీ దృశ్యం. రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు అస్తమిస్తున్నట్టు ఉన్న ఈ దృశ్యం చూపరులను ఆకర్షించింది.
మాస్కులు లేకపోతే సినిమా థియేటర్లలోకి కూడా అనుమతించడం లేదు. ఈ మేరకు మాస్క్ లేకపోతే థియేటర్ లోపలికి ప్రవేశం లేదంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు ఆ�
కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ విభాగం అప్రమత్తమైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరంలో శానిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం యుద్ధప్రాతిపదిక
హల్దీవాగులో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేసి పదమూడో రోజైన చెక్ డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి.
కరోనా కట్టడికి ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ సహా పలు రాష్ట్రాల్లో వారాంతపు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ తో జనాలు లేక రోడ్లన్నీ ఇలా వెలవెలబోయాయి.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసే సరికి 88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.