మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 12, 2020 , 15:53:47

రానా క‌పూర్ కుమార్తె రోష్నిక‌పూర్‌కు బెయిల్ మంజూరు

రానా క‌పూర్ కుమార్తె రోష్నిక‌పూర్‌కు బెయిల్ మంజూరు

ముంబై : యెస్ బ్యాంకు వ్య‌వ‌స్థాప‌కుడు రానా క‌పూర్ కుమార్తె రోష్ని క‌పూర్‌కు ముంబై మేజిస్ర్టేట్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్‌తో సంబంధం ఉన్న యెస్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో రోష్ని క‌పూర్ నిందితురాలిగా ఉంది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్న ఎనిమిది మంది నిందితుల్లో ఈమె ఒకరు. ఈ కేసుకు సంబంధించి రోష్ని కపూర్‌ను న్యాయ‌స్థానం గత నెల విచార‌ణ‌కు పిలిచింది. బెయిల్ అభ్య‌ర్థ‌న పెట్టుకోగా మేజిస్ర్టేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింద‌ని ఆమె న్యాయ‌వాది సుభాష్ జాద‌వ్ తెలిపారు. 

అవినీతి నిరోధక చట్టం (పీసీ) చట్టం, ఐపీసీ సెక్ష‌న్ల కింద రానా కపూర్‌తో పాటు ఇతరులపై సీబీఐ ఈ ఏడాది జూన్‌లో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే పీసీ చట్టం కింద ప్రాసిక్యూషన్‌కు అవసరమైన అనుమతి పొందకపోవడంతో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు అవినీతి ఆరోపణలను తొలగించింది. అనంత‌రం విచార‌ణ నిమిత్తం కేసును మేజిస్ర్టేట్ కోర్టుకు త‌ర‌లించారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను మేజిస్ట్రేట్ కోర్టు గత నెలలో అంగీకరించి రోష్ని కపూర్‌తో పాటు మరో నాలుగు సంస్థలైన డీహెచ్‌ఎఫ్ఎల్, బిలీఫ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్‌కేడ‌బ్ల్యూ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్‌, డీవోఎల్‌టీ అర్బ‌న్ వెంచ‌ర్స్‌(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌కు స‌మ‌న్లు జారీ చేసింది. స‌మ‌న్ల‌కు స్పందించిన రోష్ని క‌పూర్ కోర్టుకు హాజ‌రై బెయిల్‌ను కోరింది. న్యాయ‌స్థానం బెయిల్‌ను మంజూరు చేసింది.