ముంబై : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్నాడు. శుక్రవారం దాదర్‌లోని ఓ హాస్పిటల్లో ఆయన టీకా వేయించుకున్నాడు. సల్మాన్‌తో పాటు అతని సోదరుడు సోహేల్ ఖాన్ కూడా వ్యాక్సినేషన్ సెంటర్లో కనిపించాడు. అతను కూడా సెకండ్ డోసు వేసుకున్నట్లు తెలిసింది. ఖాన్ సోదరులు వ్యాక్సినేషన్ సెంటర్‌కు చేరుకున్న దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. సల్మాన్ నటించిన రాధే చిత్రం.. రంజాన్ సందర్భంగా ఈనెల 13వ తేదీన ఆన్లైన్లో రిలీజైన విషయం తెలిసిందే.