బెంగళూరు: మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించాయి. వంటకు వినియోగించిన బియ్యం కూడా పురుగులమయంగా ఉన్నాయి. దీంతో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. (Worm Infested Rice) కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం అంతా పరుగులతో నిండి ఉన్నాయి. బిసరల్లి గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో నాణ్యత లేని ఈ బియ్యంతోనే మధ్యాహ్న భోజనం వండారు. దీంతో అన్నంలో పురుగులు ఉండటం చూసి విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ముద్దెనహళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటన జరిగింది. దీంతో విద్యార్థుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. నాణ్యత లేని బియ్యం, పప్పు ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:
Vijay Shah | మరోసారి నోరు జారిన మంత్రి.. లబ్ధిపొందే మహిళలు సీఎం సభలకు రావాలని డిమాండ్