భువనేశ్వర్: ఒక విద్యార్థి స్కూల్‌కు రివాల్వర్ తెచ్చాడు. తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడ్ని ఆ గన్‌తో బెదిరించాడు. (Student Brings Revolver To School) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొరువాలోని ప్రభుత్వ హైస్కూల్లో 14 ఏళ్ల బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం దేశీయ రివాల్వర్‌ను స్కూల్‌కు తీసుకువచ్చాడు. క్లాస్‌రూమ్‌లో తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడు, టీచర్లను ఆ గన్‌తో బెదిరించాడు. ఈ సంఘటనతో వారు షాక్ అయ్యారు.
కాగా, హెడ్మాస్టార్ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ స్కూల్‌కు చేరుకున్నారు. మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దేశీయ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడ్ని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పర్చిన తర్వాత స్పెషల్ హోమ్‌కు తరలించారు. ఆ తుపాకీ బాలుడికి ఎలా వచ్చింది అన్నదానిపై అతడి తల్లిదండ్రులు, బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Also Read:
Teacher Couple Die | పొగమంచు కారణంగా కాలువలో పడిన కారు.. ఉపాధ్యాయ దంపతులు మృతి
woman marries Krishna idol | కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన మహిళ.. ఎందుకంటే?