లక్నో: బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఒకచోట దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహిళా ఎస్ఐ తన పోలీస్ బృందంతో కలిసి అక్కడకు వెళ్లారు. నిందితుడు కాల్పులు జరుపడంతో ఆమె ఎదురుకాల్పులు జరిపారు. (Woman cop shoots man) ఎన్కౌంటర్లో గాయపడిన నిందితుడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికపై కమల్ కిషోర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతికారు.
కాగా, మే 28న మదేగంజ్ ప్రాంతంలో నిందితుడు కమల్ కిషోర్ దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ సకీనా ఖాన్ తన సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. పోలీసులను చూడగానే నిందితుడు కమల్ కిషోర్ కాల్పులు జరిపాడు. అయితే ఎస్ఐ సకీనా ఖాన్ వెంటనే స్పందించారు. తన సర్వీస్ పిస్టల్‌తో కాల్పులు జరుపడంతో నిందితుడు గాయపడ్డాడు. కమల్ కిషోర్‌ను అరెస్టు చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనను డీఎస్పీ ధృవీకరించారు. నిందితుడిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
Also Read: