భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించరా? 21 రోజుల్లో ట్రంప్ ఇలా ప్రకటించడం ఇది 11వ సారి. చివరికి కోర్టుల్లోనూ అదే వాదన. కానీ ట్రంప్ ప్రకటనలపై ప్రధాని మోదీ పూర్తిగా మౌనం వహిస్తున్నారు. ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?’
– జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
త్రివిధ దళాలను సంప్రదించకుండానే కేంద్రం పాక్‌తో కాల్పుల విరమణను ప్రకటించింది. దీని గురించి మూడో దేశం (అమెరికా) సోషల్ మీడియా ద్వారా ప్రకటించటం షాక్‌కు గురి చేసింది.
– సుఖ్విందర్ సుఖు, హిమాచల్ ప్రదేశ్ సీఎం