Jyoti Malhotra | యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్..!
Jyoti Malhotra | భారత సైన్యానికి (Indian Army) చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ను అరెస్టు చేశారు.
Jyoti Malhotra : భారత సైన్యానికి (Indian Army) చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) ను అరెస్టు చేశారు. ఆమె కేరళ (Kerala) పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు.
కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతి మల్హోత్రా పర్యటనకు టూరిజం డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిందని సురేంద్రన్ ఆరోపించారు. మహ్మద్ రియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడని, ఆయన నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కన్నూర్ ట్రిప్‌కు స్పాన్సర్ చేసిందని చెప్పారు. ‘టూర్లో ఆమె ఎవరిని కలిసింది? ఎక్కడికి వెళ్లింది? అసలు ఆమె అజెండా ఏంటి? పాక్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు?’ అని సురేంద్రన్ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు.
ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్‌తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి.. డానిష్‌తో మాట్లాడినట్లు సమాచారం. అందుకే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను ప్రశ్నించారు. జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే ఆమె అలా చేయకూడదని తెలిసి కూడా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందనే విషయం స్పష్టమైందని చెప్పారు.
Read More >>
Tejpratap Yadav | అమ్మా నాన్నా.. మీరిద్దరే నా ప్రపంచం.. నాకు మీ ప్రేమ కావాలి : తేజ్‌ప్రతాప్ యాదవ్
Bridge Collaps | రైల్వే ట్రాక్‌పై కూలిన బ్రిడ్జి.. ఏడుగురు దుర్మరణం
Chain snachers | షాపులో చొరబడి.. మహిళ పుస్తెలతాడు లాక్కెళ్లి.. ఉప్పల్‌లో మహిళా చైన్ స్నాచర్స్
MJ Akbar | పాము ఎప్పుడూ తన విషంతో తాను చావదు.. పాకిస్థాన్‌పై ఎంజే అక్బర్ ఫైర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

