మాస్కో: రష్యాలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై వంతెన కుప్పకూలింది (Bridge Collaps). అదే సమయంలో మాస్కో నుంచి క్లిమోవ్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఏడుగురు మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో రైలు లోకో పైలట్ కూడా ఉన్నరని రిజినల్ గవర్నర్ అలెగ్జాండర్ జోగోమాజ్ వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయని, సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. ఫెడరల్ హైవే సమీపంలో రైలు పట్టాలు తప్పిందని పేర్కొన్నారు. ప్రభుత్వ వర్గాలు షేర్ చేసిన ఫొటోల్లో రైలుపై వంతెన కాంక్రీట్ ముక్కల పడిపోవడంతో.. బోగీలు చెల్లాచెదురుగా పడిపోయినట్లు ఉన్నాయి.
అయితే బ్రిడ్జి ప్రమాద వశాత్తు కూలిందా లేదా ఎవరైనా పేల్చివేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంతెనను ఉద్దేశపూర్వకంగా పేల్చివేసి ఉండవచ్చని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఇప్పటివరకు ఉక్రేయిన్ స్పందించలేదు.
🚨 Bridge collapses in Russia’s Bryansk Region, causing train derailment – reports
A bridge collapse in the Bryansk Region led to an accident involving a train and several vehicles, local authorities confirmed. One child is in serious condition, and the train operator was… pic.twitter.com/lFOIB59bAJ
— Sputnik (@SputnikInt) May 31, 2025