Digital Fraud | దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సొమ్ము కాజేసేందుకు నేరగాళ్లు కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgam attack) పేరుతో ఓ వృద్ధురాలిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు (digital fraud). రూ.లక్షల్లో సొమ్ము కాజేశారు.
వివరాల్లోకి వెళితే.. నోయిడా (Noida) సెక్టార్ 41లో నివాసం ఉండే 76 ఏండ్ల సరళా దేవి అనే వృద్ధురాలికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తాను పోలీసు ఆఫీసర్‌ను అని, ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్నట్లు చెప్పాడు. మీ పేరుతో ముంబైలో ఓ బ్యాంకు ఖాతా తెరిచినట్లు చెప్పారు. ఆ బ్యాంకు ఖాతా నుంచి ఉగ్రవాదులకు నిధులు బదిలీ అయినట్లు చెప్పాడు. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కూడా ఇదే ఖాతా నుంచి డబ్బు సమకూరినట్లు నమ్మించాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్న కారణంగా మీపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వృద్ధురాలిని బెదిరించాడు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యిందని చెప్పాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సెక్యూరిటీ డిపాజిట్‌గా కొంత సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశాడు.
అతడి మాటలకు భయపడిపోయిన వృద్ధురాలు.. దుండగుడు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా పలుమార్లు డబ్బులు పంపింది. జులై 20 నుంచి ఆగస్టు 13 వరకూ విడతల వారీగా మొత్తం రూ.43.70 లక్షలు సెండ్ చేసింది. అంతటితో ఆగని దుండగుడు మరో రూ.15 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సరళాదేవి లాయర్ని సంప్రదించింది. చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
RCB | సంతోషకరమైన క్షణం.. విషాదంగా మారింది.. తొక్కిసలాట ఘటనపై కోహ్లీ భావోద్వేగం
Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి ముసలం.. సిద్ధరామయ్య, డీకే వర్గీయుల మాటల యుద్ధం