శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి అవసరమైన సామాగ్రితో తొలి గూడ్స్ రైలు కశ్మీర్‌కు చేరుకున్నది. (1st Freight Train to Kashmir) సైనికులకు అవసరమైన శీతాకాల సామాగ్రిని చేరవేసింది. ఆ తర్వాత కశ్మీర్ రైతులు పండించిన ఆపిల్స్ లోడ్‌తో ఢిల్లీకి ప్రయాణమైంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ అందుబాటులోకి రావడంతో ఇది సాధ్యమైనట్లు భారత ఆర్మీ తెలిపింది. 753 మెట్రిక్ టన్నుల శీతాకాలపు స్టాక్‌తో తొలి కార్గో రైలు అనంత్‌నాగ్ చేరుకున్నట్లు పేర్కొంది. చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించింది.
కాగా, సవాళ్లతో కూడిన హిమాలయ భూభాగంలో ఆర్మీతోపాటు ప్రజలకు ఈ రవాణా రైలు ఎంతో ఉపయోగకరమని ఆర్మీ తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కొండచరియలు విరుగడంతో రోడ్లు మూసుకుపోయాయని, దీంతో నిలిపోయిన లారీల్లోని ఆపిల్స్ కుళ్లుతుండగా ఈ రైలు ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ఆపిల్స్ రవాణా జరిగినట్లు పేర్కొంది. ఆర్మీకి రవాణా పరంగాను, కశ్మీర్ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఈ కార్గో రైలు సేవలు దోహదపడతాయని వెల్లడించింది.
మరోవైపు అనంతనాగ్ స్టేషన్లో సైన్యం కోసం శీతాకాల సరుకులను దిగుమతి చేసిన తర్వాత ఈ కార్గో రైలు బుద్గాం చేరుకున్నది. అక్కడ ఆపిల్స్‌ను ఈ రైలులో లోడ్ చేశారు. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ఈ గూడ్స్ రైలును ప్రారంభించారు. దీంతో కశ్మీర్ ఆపిల్స్ లోడ్‌తో ఈ రైలు ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది.
Also Read:
Air Force Engineer Suicide | 24వ అంతస్తు పైనుంచి దూకి.. ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్ ఆత్మహత్య
brain-eating amoeba | కేరళలో 67కు చేరిన మెదడు తినే అమీబా కేసులు.. 18 మరణాలు నమోదు