బెంగళూరు: ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Air Force Engineer Suicide) 24వ అంతస్తు పైనుంచి కిందకు దూకి మరణించాడు. సోదరి ఇంటికి వెళ్లిన అతడు అక్కడ జరిగిన గొడవ వల్ల సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల లోకేష్ పవన్ కృష్ణ ఐఏఎఫ్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. హలసూరు మిలిటరీ క్వార్టర్స్‌లో అతడు నివసిస్తున్నాడు.
కాగా, ఆదివారం సాయంత్రం లోకేష్ బెంగళూరులోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ జరిగిన గొడవ నేపథ్యంలో జిందాల్ సిటీ అపార్ట్మెంట్స్లోని 24వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లోకేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోదరి ఇంట్లో జరిగిన గొడవ వల్ల అతడు ఆగ్రహంతో బిల్డింగ్ పైనుంచి కిందకు దూకాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త
Baby Girl Buried Alive | 15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు.. రక్షించిన పోలీసులు
Watch: ఎలుగుబంటికి కూల్ డ్రింక్ ఇచ్చిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే?