తిరువనంతపురం: కేరళలో మెదడు తినే అమీబా కేసుల సంఖ్య 67కు చేరింది. (brain-eating amoeba) తాజాగా 17 ఏళ్ల బాలుడికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన ఇన్ఫెక్షన్ సోకింది. స్నేహితులతో కలిసి అక్కులం టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన తర్వాత ఆ యువకుడు ఈ వ్యాధి బారినపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ స్విమ్మింగ్ పూల్‌ను అధికారులు మూసివేశారు. నీటి నమూనాలు సేకరించి పరీక్ష కోసం పంపారు.
కాగా, మెదడు తినే అమీబా వ్యాధి కారణంగా కేరళలో గత వారం ఒకే నెలలో ఐదో మరణం సంభవించింది. మలప్పురం జిల్లాలోని వండూర్‌కు చెందిన 56 ఏళ్ల శోభనకు ఈ వ్యాధి సోకింది. కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అదే హాస్పిటల్లో చికిత్స పొందిన సుల్తాన్ బతేరీకి చెందిన 45 ఏళ్ల రతీష్ అనే మరో రోగి కూడా అదే వ్యాధితో చనిపోయాడు. దీంతో మెదడు తినే అమీబా వల్ల ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు.
మరోవైపు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వ్యాధి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. నీటి వనరులు, పారిశుద్ధ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ‘నీటి నిల్వలను శుభ్రంగా ఉంచాలి. అమీబా ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి’ అని సూచించారు.
Also Read:
Air Force Engineer Suicide | 24వ అంతస్తు పైనుంచి దూకి.. ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్ ఆత్మహత్య
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త
Baby Girl Buried Alive | 15 రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు.. రక్షించిన పోలీసులు