బుధవారం 27 జనవరి 2021
National - Dec 24, 2020 , 17:58:59

డీఎంకేతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు : ఎంకే అళగిరి

డీఎంకేతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు : ఎంకే అళగిరి

చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని డీఎంకే నాయకుడు, కరుణానిధి కుమారుడు ఎంకే అళగిరి తేల్చి చెప్పారు. గురువారం చెన్నైలోని గోపాలపురంలో తన తల్లిని కలిసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.  జనవరి 3న తన మద్దతుదారులతో సమావేశమై వారి అభీష్టం మేరకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీతో పొత్తుపెట్టుకోబోతున్నారా.! అన్న ప్రశ్నకు ఇప్పటివరకు అటువైపుగా ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

పొత్తు పెట్టుకోవడం తమ చేతుల్లో లేదని దాన్ని రజనీకాంతే నిర్ణయించాలని పొత్తుపై పరోక్షంగా సంకేతాలిచ్చారు. రజనీకాంత్ ప్రస్తుతం చెన్నైలో లేరని ఆయన రాగానే కలిసి మాట్లాడతానని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి అళగిరి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు స్వయానా పెద్దన్నయ్య. 2014లో స్టాలిన్‌కు, అలగిరికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో అళగిరిని తండ్రి కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. నాటి నుంచి ఆయన డీఎంకేలోనే కొనసాగుతున్నా.. స్టాలిన్‌కు మాత్రం ఏ విషయంలోనూ సహకరించడం లేదు. పరోక్షంగా పార్టీ విజయానికి గండికొడుతూనే ఉన్నారు.   

ఇవి కూడా చదవండి..

100కు డ‌య‌ల్ చేసిన వ‌ధువు.. పీట‌ల‌పై ఆగిన పెళ్లి..

నీరు తాగుతున్న చిరుతపై దాడిచేసిన మొసలి.. వీడియో

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo