బెంగళూరు: ఒక వ్యక్తికి తెల్లవారుజామున ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో భార్యతో కలిసి బైక్‌పై హాస్పిటల్‌కు వెళ్లాడు. పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని వారు సూచించడంతో అక్కడకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి బైక్ పైనుంచి కిందపడ్డాడు. రోడ్డుపై అతడు మరణించాడు. అయితే సహాయం కోసం అతడి భార్య ప్రాధేయపడినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. (man dies of heart attack on road) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బనశంకరి ప్రాంతంలో 34 ఏళ్ల వెంకటరమణన్ నివసిస్తున్నాడు. డిసెంబర్ 13న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఇంట్లో అతడికి ఛాతిలో నొప్పి వచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురై వాంతులు చేసుకున్నాడు.
కాగా, వెంకటరమణన్ తన భార్యతో కలిసి బైక్‌పై సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో సమీపంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి వారు వెళ్లారు. అక్కడి సిబ్బంది ఈసీజీ పరీక్ష చేయగా వెంకటరమణన్‌కు తేలికపాటి గుండెపోటు వచ్చినట్లు తేలింది. అయితే ఆయనకు ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించలేదు. వెంటనే జయదేవా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అంబులెన్స్ కూడా సమకూర్చలేదు.
మరోవైపు భార్యాభర్తలు బైక్‌పై ఆ ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో ఒక వంతెన సమీపంలో వెంకటరమణన్‌కు మళ్ళీ తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది. దీంతో బైక్‌పై నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురయ్యాడు. బైక్ పైనుంచి రోడ్డుపై పడిపోయాడు. ఇది చూసి భార్య ఆందోళన చెందింది. రోడ్డుపై వెళ్లే వాహనదారులను సహాయం కోసం ఆమె ప్రాథేయపడింది. అయితే ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రోడ్డుపై పడిన వెంకటరమణన్ గుండెపోటుతో మరణించాడు. అతడికి ఐదేళ్ల కుమారుడు, ఏడాదిన్నర కుమార్తె ఉన్నది. వెంకటరమణన్ కళ్లను భార్య దానం చేసింది.
అయితే వెంకటరమణన్ మరణవార్త విని అతడి తల్లికి కూడా గుండెపోటు వచ్చింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించగా కోలుకున్నది. మొత్తం ఆరుగురు సంతానంలో ఐదుగురు పిల్లలు వివిధ దశల్లో చనిపోయారు. చివరి సంతానమైన వెంకటరమణన్ కూడా మరణించడాన్ని అతడి తల్లి తట్టుకోలేకపోయింది. కాగా, భర్తను కాపాడుకునేందుకు భార్య చేతులు జోడించి రోడ్డుపై ప్రాథేయపడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
💔 Heartbreaking incident from Bengaluru.
34 year old Venkataraman had chest pain. His wife rushed him on a bike to a private hospital no doctor, no first aid, sent back. Second hospital confirmed a minor heart attack, but no treatment or ambulance there either.
Forced to try a… pic.twitter.com/unrPkLX11x
— The News Drill (@thenewsdrill) December 17, 2025
Also Read:
Watch: బావిలో పడిన కుమార్తె.. కాపాడేందుకు అందులోకి దూకిన తండ్రి
Horses Run Across Busy Road | రద్దీ రోడ్డుపై గుర్రాల పరుగులు.. తర్వాత ఏం జరిగిందంటే?