చెన్నై: రద్దీ రోడ్డుపై మూడు గుర్రాలు పరుగులు తీశాయి. ఇద్దరు పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తున్న మహిళ స్కూటీని ఢీకొట్టాయి. దీంతో అదుపుతప్పిన ఆమెతో పాటు పిల్లలు రోడ్డుపై పడిపోయారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. (Horses Run Across Busy Road) తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం వెల్లకినారు పిరివు సమీపంలోని మెట్టుపాళయం రోడ్డులో అకస్మాత్తుగా మూడు గుర్రాలు రోడ్డుకు అడ్డంగా పరిగెత్తాయి. ఇద్దరు స్కూల్ పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తున్న మహిళను అవి ఢీకొట్టాయి. దీంతో స్కూటీ అదుపుతప్పడంతో ఆ మహిళ, ఇద్దరు పిల్లలు రోడ్డుపై పడ్డారు. ఆ ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.
కాగా, అక్కడున్న జనం వెంటనే స్పందించారు. రోడ్డుపై పడిన మహిళ, స్కూల్ విద్యార్థులకు సహాయం చేశారు. గుర్రాలను దూరంగా తరిమారు. ఈ ఆకస్మిక సంఘటనకు అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఒక వ్యక్తి మొబైల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
A sudden and frightening moment on #MettupalayamRoad near Vellakinaru Pirivu, #Coimbatore, as stray horses ran across the road, leading to an accident pic.twitter.com/0PBqzb56Jq
— GNW News ⚡ Genuine National Window (@gnwnews_a) December 16, 2025
Also Read:
Man Rescued With Kidnapper’s Smartwatch | వ్యక్తి కిడ్నాప్.. కాపాడిన కిడ్నాపర్ స్మార్ట్‌వాచ్
RG Kar Rape Murder Case | ఆర్జీ కర్ హత్యాచారం కేసు.. కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ
Watch: రోడ్డుపై లేన్ మారిన క్యాబ్.. తర్వాత ఏం జరిగిందంటే?