న్యూఢిల్లీ: ఆర్జీ కర్ హత్యాచారం కేసును కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. తమ ఆదేశాల అమలును పర్యవేక్షించాలని కోరింది. స్టేటస్ రిపోర్ట్ కాపీని బాధితురాలి తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలని పేర్కొంది. (RG Kar Rape Murder Case) గత ఏడాది ఆగస్ట్ 9న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ దారుణం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. బెంగాల్ డాక్టర్లు చాలా కాలం నిరసన చేశారు.
కాగా, సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. వైద్యుల భద్రత, వారి సమస్యలను పరిష్కరించే సిఫార్సులు రూపొందించడానికి జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తమ ఆదేశాల అమలు కోసం ఈ కేసును కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం బదిలీ చేసింది.
మరోవైపు, ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడైన సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ ఏడాది జనవరి 20న అతడికి శిక్ష ఖరారు చేసింది. మరణించే వరకు జీవిత ఖైదు విధించింది.
Also Read:
Man Rescued With Kidnapper’s Smartwatch | వ్యక్తి కిడ్నాప్.. కాపాడిన కిడ్నాపర్ స్మార్ట్‌వాచ్
Watch: రోడ్డుపై లేన్ మారిన క్యాబ్.. తర్వాత ఏం జరిగిందంటే?