న్యూఢిల్లీ: రోడ్డుపై వెళ్తున్న క్యాబ్ లేన్ మారింది. అయితే అదే లేన్‌లో వేగంగా వచ్చిన బైకర్ ఆ కారును ఢీకొట్టాడు. (Biker Crashes Cab) దీంతో గాలిలోకి ఎగిరి కిందపడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం అంబియన్స్ మాల్ సమీపంలోని రహదారిపై వాహనాలు వేగంగా దూసుకెళ్లాయి.
కాగా, మారుతి సుజుకి డిజైర్ క్యాబ్ డ్రైవర్ ఉన్నట్టుండి లేన్ మారాడు. అయితే అదే లేన్‌లో వేగంగా వెళ్తున్న బైకర్ ఆ క్యాబ్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ పక్కకు పడిపోగా నడిపిన వ్యక్తి గాలిలోకి ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన బైకర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో బైకర్ తన బైక్‌పై అమర్చిన కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Hayabusa Crashes After Cab Changes Lane Near Gurugram’s Ambience Mall pic.twitter.com/WTKiSEmTKa
— NDTV (@ndtv) December 15, 2025
Also Read:
Deepathoon | దీపథూన్ హిందువుల స్తంభం కాదు.. జైన సాధువులు వినియోగించారు: తమిళ ప్రభుత్వం
Man Burnt Alive In Car | కారుకు నిప్పంటించి.. ఒక వ్యక్తిని సజీవ దహనం