ముంబై: ఒక వ్యక్తిని గోనె సంచిలో కుక్కారు. అతడి కారులోని సీటులో ఆ సంచిని ఉంచారు. ఆ కారుకు నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఆ వ్యక్తి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Man Burnt Alive In Car) మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి వనవాడ రోడ్డులో కారు కాలిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
కాగా, గోనె సంచిలో కుక్కిన వ్యక్తి మంటల్లో కాలి మరణించినట్లు పోలీసులు గమనించారు. దీంతో వైద్య బృందాన్ని అక్కడకు రప్పించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఔసా తండాకు చెందిన గణేష్ చవాన్‌గా మృతుడ్ని గుర్తించారు. మృతదేహాన్ని అతడి కుటుంబానికి అప్పగించారు. గణేష్‌ను సంచిలో కుక్కి కారు సీటులో ఉంచి నిప్పుపెట్టినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Worm Infested Rice | కర్ణాటక మధ్యాహ్న భోజనంలో పురుగులు.. విద్యార్థులు ఆందోళన