న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజు రోజుకు దిగజారుతున్నది. వాయు కాలుష్యంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా దీని గురించి మాట్లాడారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు. (Arvind Kejriwal Vs Rekha Gupta) ‘ఢిల్లీలో నివసిస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు ఢిల్లీ కాలుష్య సమస్యకు పరిష్కారాలు కనుగొంటున్నాం. ఢిల్లీని, విధులను వదిలి దగ్గు నయం కోసం ప్రతి ఆరు నెలలకు విపాసన కేంద్రానికి పారిపోయే వాళ్లం కాదు’ అని ఆమె అన్నారు.
కాగా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు. బుద్ధుడు బోధించిన దైవిక ధ్యాన అభ్యాసాన్ని ఎగతాళి చేయడం ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు తగదని విమర్శించారు. ‘రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ విపాసనను ఎగతాళి చేయడం సీఎంకు తగదు’ అని అన్నారు.
అలాగే విపాసన సాధన చేయాలని సీఎం రేఖా గుప్తాకు అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ‘అది అపారమైన శాంతిని అందిస్తుంది. విపాసన చేయడం అంటే ‘పారిపోవడం’ కాదు. అదృష్టవంతులకు మాత్రమే ఆ ఆశీర్వాదం దక్కుతుంది’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read:
Worm Infested Rice | కర్ణాటక మధ్యాహ్న భోజనంలో పురుగులు.. విద్యార్థులు ఆందోళన
woman marries Krishna idol | కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన మహిళ.. ఎందుకంటే?