కోల్‌కతా: ఇద్దరు బీజేపీ నేతలు అదృశ్యమయ్యారు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. అయితే మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయడంతో ఆ ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (BJP leaders arrested in drug trafficking) పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దిన్హటకు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణ బర్మాన్, మరో నేత అశుతోష్ రే మంగళవారం అదృశ్యమయ్యారు. పాత రాజకీయ కేసులో విచారణ కోసం కోర్టుకు హాజరైన తర్వాత కనిపించలేదని కృష్ణ బర్మాన్ కుటుంబం తెలిపింది. పోలీసులు వారిని అక్రమంగా నిర్బంధించినట్లు ఆరోపించింది. దీంతో ఇది రాజకీయ వివాదానికి దారి తీసింది.
కాగా, ఇద్దరు బీజేపీ నేతల మిస్సింగ్‌పై పోలీసులు బుధవారం క్లారిటీ ఇచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి కృష్ణ బర్మాన్, అశుతోష్ రేను అరెస్టు చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ సరిహద్దు వైపు స్కూటర్‌పై వెళుతుండగా సీతాయ్లోని సాగర్డిఘి వంతెన ప్రాంతంలో తనిఖీ చేసినట్లు చెప్పారు. వారి వద్ద లభించిన 55 గ్రాముల యాబా మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
మరోవైపు బుధవారం ఉదయం కూచ్ బెహార్‌లోని ఎన్డీపీఎస్ కోర్టులో ఇద్దరు నిందితులను హాజరుపరిచినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే తమ పార్టీ నేతలను తప్పుడు కేసులో పోలీసులు ఇరికించారని బీజేపీ ఆరోపించింది.
Also Read:
Man Rescued With Kidnapper’s Smartwatch | వ్యక్తి కిడ్నాప్.. కాపాడిన కిడ్నాపర్ స్మార్ట్‌వాచ్
RG Kar Rape Murder Case | ఆర్జీ కర్ హత్యాచారం కేసు.. కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ
Horses Run Across Busy Road | రద్దీ రోడ్డుపై గుర్రాల పరుగులు.. తర్వాత ఏం జరిగిందంటే?