అహ్మదాబాద్: ఒక యువతి ప్రమాదవశాత్తు బావిలో పడింది. గమనించిన తండ్రి కూడా వెంటనే బావిలోకి దూకాడు. తన కుమార్తెను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే బావి లోతుగా ఉండటంతో వారిద్దరూ పైకి రాలేకపోయారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది తండ్రి, కుమార్తెను బావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు. (man jumps into well to save daughter) గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. చంద్లోడియా ప్రాంతం గజరాజ్ సొసైటీ ఏరియాలోని గార్డెన్లో ఒక కుటుంబం పనిచేస్తున్నది.
కాగా, మంగళవారం రాత్రి 19 ఏళ్ల అంజలి ప్రమాదవశాత్తు బావిలో పడింది. 45 ఏళ్ల తండ్రి
రాజేష్ సైనీ గమనించాడు. కుమార్తెను కాపాడేందుకు వెంటనే ఆ బావిలోకి దూకాడు. వారిద్దరిని ఆ బావి నుంచి బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే ఆ బావి 60 అడుగుల లోతు ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.
మరోవైపు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. బావిలో ఉన్న తండ్రి, కుమార్తెను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తాళ్ల సహాయంతో ఫైర్ సిబ్బంది ఆ బావిలోకి దిగారు. వారిద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
દીકરીને બચાવવા પિતા કૂવામાં કૂદ્યા, બંને ડૂબે તે પહેલાં દિલધડક રેસ્ક્યુ; Ahmedabadના ચાંદલોડિયાની ઘટના#Ahmedabad #Chandlodia #RescueOperation #AhmedabadNews #Gscard #Gujaratsamachar pic.twitter.com/9J8vSa3dix
— Gujarat Samachar (@gujratsamachar) December 16, 2025
Also Read:
RG Kar Rape Murder Case | ఆర్జీ కర్ హత్యాచారం కేసు.. కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ
Horses Run Across Busy Road | రద్దీ రోడ్డుపై గుర్రాల పరుగులు.. తర్వాత ఏం జరిగిందంటే?