లక్నో: ఏసీ కంప్రెసర్‌లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం వైశాలి సెక్టార్ 4లోని గౌర్ గ్రావిటీ హైట్స్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఎయిర్ కండిషనర్ (ఏసీ)ను ఇద్దరు వ్యక్తులు రిపేర్ చేస్తున్నారు.
కాగా, ఏసీ కంప్రెసర్ సిలిండర్‌లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతుడ్ని ఏసీ మెకానిక్ పింటూగా గుర్తించారు. గాయపడిన పురాన్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: