చెన్నై: ప్రభుత్వ ఆసుపత్రి నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మొబైల్ ఫోన్ చూడటంలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కత్తెరతో నవజాత శిశువు బొటనవేలు నరికింది. (Nurse severs newborn’s thumb) దీంతో సర్జరీ కోసం ఆ శిశువును మరో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ సంఘటన జరిగింది. మే 24న వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఒక మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.
కాగా, ఈ సందర్భంగా సీనియర్ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మొబైల్ ఫోన్ చూస్తూ శిశువు చేతికి ఉన్న గ్లూకోజ్ సూదిని మార్చడానికి ప్రయత్నించింది. టేప్ తొలగించేటప్పుడు ఏమరపాటు వల్ల శిశువు బొటనవేలును కత్తెరతో కత్తిరించింది. తీవ్రంగా గాయపడిన ఆ శిశువుకు అత్యవసర శస్త్రచికిత్స కోసం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు వెల్లూరు జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై స్పందించారు. 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న నర్సు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత విచారణకు ఆదేశించారు. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: