తిరువనంతపురం: ఒక కారు నదిలో చిక్కుకున్నది. దాని టైర్లు ఇసుకలో కురుకుపోయాయి. దీంతో ఎంత ప్రయత్నించినా ఆ కారు కదలలేదు. అయితే ఒక ఏనుగు ఎంతో ఈజీగా దానిని నది నుంచి బయటకు లాగింది. (Elephant Pulls SUV) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరువేగప్పుర గ్రామంలోని నదిలో టయోటా ఫార్చ్యూనర్ ఎస్యూవీ చిక్కుకున్నది. కారు టైర్లు నదిలోని ఇసుకలో కూరుకుపోయాయి. దీంతో డ్రైవర్ ఎంత ప్రయత్నించినప్పటికి ఎస్యూవీ అక్కడి నుంచి కదలలేదు.
కాగా, ఒక ఏనుగును అక్కడకు రప్పించారు. కారు ముందు భాగానికి తాడు కట్టారు. ఏనుగు తన తొండం, నోటితో ఆ తాడును బలంగా లాగింది. దీంతో నదిలో చిక్కుకున్న కారు నీటి నుంచి బయటకు వచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు సుమారు 2,000 కిలోల బరువున్న ఎస్యూవీని ఏనుగు చాలా ఈజీగా నది నుంచి బయటకు లాగడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘ఇది హార్స్ పవర్ కాదు. ఇది ఏనుగు శక్తి’ అని చాలా మంది కొనియాడారు. అయితే రెస్క్యూ వాహనానికి బదులుగా ఏనుగు బలంతో కారును నది నుంచి బయటకు లాగడాన్ని జంతు ప్రియులు విమర్శించారు.