Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ పండగ వచ్చినట్టు ఫీలవుతుంటారు. అయితే కొన్ని సార్లు ఈ ఫ్యాన్స్ వలన మహేష్ బాబు కొంత ఇబ్బంది పడే పరిస్తితి నెలకొంది. అయితే మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ రీరిలీజ్‌కి మంచి ఆదరణ ఏర్పడింది. అయితే ఖలేజాకి అప్పట్లో అంత ఆదరణ రాకపోవడానికి కారణం మహేష్ ఫ్యాన్స్ అని నిర్మాత సి. కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఖలేజా సినిమా రిలీజైనప్పుడు అభిమానులే ఎవరినీ చూడనివ్వలేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా.. ఆరోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే అంటూ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశార.
మహేష్ బాబు ఫ్యాన్స్ ఏదో ఊహించుకున్నారు. తూ నీయమ్మ అంటూ కామెడీ చేస్తూ మహేష్ యాక్ట్ చేస్తే.. అభిమానులకు అసలు అర్థం కాలేదు. మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. విజయవాడలో మిడ్ నైట్ షో చూసిన తర్వాత, తాగేసి ఫోన్ చేసి బూతులు తిట్టారు. ఒరేయ్.. మీకు సినిమా తీయడం తెలుసా? అంటూ డైరెక్టర్ ను కూడా తిట్టారు. వాళ్లే మెసేజులు చేసుకొని సినిమాని సర్వనాశనం చేసేశారు. కానీ ఇవాళ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘ఖలేజా’ సినిమాని మళ్ళీ చూసి, ఆరోజు మేం తప్పు చేశామని అభిమానులు కచ్చితంగా మాట్లాడుకుంటున్నారు అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నట్టు కళ్యాణ్ అన్నారు.
ఇక ఖలేజా రీరిలీజ్ సందర్భంగా ఓ అభిమాని చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఖలేజా సినిమాలో మహేష్ ఎంట్రీ సీన్‌ను అనుకరించి తోటి అభిమానుల గుండె ఆగినంత పని చేశాడు. మహేష్ అభిమాని ఓవరాక్షన్‌తో ఫ్యాన్స్ హడలిపోయారు.విజయవాడలోని ఓ థియేటర్లో ఖలేజా మూవీని చూసేందుకు వచ్చిన ఓ అభిమానిఏకంగా నిజమైన పాము పిల్లతో థియేటర్లోకి అడుగుపెట్టాడు. మొదట అది రబ్బర్ పాము అని లైట్ తీసుకున్న ఫ్యాన్స్.. నిజమైన పాము అని తెలియడంతో ఉరుకులు పెట్టారు. థియేటర్ యజమానికి ఈ విషయం తెలియడంతో సదరు అభిమానిని బయటకు పంపించేశారు. ఈ ఘటనతో కాసేపు థియేటర్లో గందరగోళం నెలకొంది. కాగా, మహేష్ ఎంట్రీ సీన్లో పాముతో నడిచొచ్చే సీన్ వీర లేవల్లో ఉంటుంది. అందుకు సదరు అభిమాని మహేష్ ఎంట్రీ సీన్‌ను యదావిధిగా అనుకరించాడు అని అనుకుంటున్నారు.
#Khaleja4KReRelease
విజయవాడ సినిమా హాల్ లో పాము కలకలం..#Khaleja4K రీరిలీజ్ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం..#MaheshBabu ఎంట్రీ సీన్ లో పాముతో నడిచివచ్చే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయడం కోసం నిజమైన పాముతో ధియేటర్లోకి వచ్చిన అభిమాని..
మొదట రబ్బర్ పాము అనుకున్న మిగిలిన ఫ్యాన్స్..… pic.twitter.com/Lwk9i5IFFY— The Cult Cinema (@cultcinemafeed) May 30, 2025