Kalpika Ganesh | ఆరేంజ్, జులాయి, సారొచ్చారు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతోపాటు పలు సినిమాల్లో మెరిసింది నటి కల్పిక గణేశ్. ఈ భామ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచింది. కల్పిక గణేశ్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు వెళ్లింది. ఈ నేపథ్యంలో బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులకు కల్పికకు మధ్య గొడవ జరిగింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనపై పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని కల్పిక గణేశ్ పేర్కొంది. అయితే ఈ గొడవ విషయంలో పబ్ మేనేజ్మెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలాగే ప్రవర్తించారని కల్పిక గణేశ్ ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
పబ్ సిబ్బంది, కల్పిక గణేశ్‌కు మధ్య మాటల యుద్దానికి సంబంధించి.. అత్యంత చెత్త మేనేజ్మెంట్లలో ఒకటి కూడా అంటూ షేర్ చేసిన వీడియో వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి
హీరోయిన్, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ – గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి
బర్త్‌డే కేక్ విషయంలో కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ
వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో కల్పికపై దాడికి దిగిన పబ్… pic.twitter.com/ACkAPFdQhh
— Telugu Scribe (@TeluguScribe) May 31, 2025
Sekhar Kammula | శేఖర్ కమ్ముల 25 ఏళ్ల ప్రస్థానం.. చిరంజీవి సమక్షంలో పాతికేళ్ల పండగ
Sobhita dhulipala | పెళ్లి తర్వాత శోభిత మొదటి బర్త్ డే..చైతూ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నాడంటే..!
Allu arjun | పొగ.. తాగితే చస్తావ్.. ‘వరల్డ్ టోబాకో డే’పై అల్లు అర్జున్ పోస్ట్