sobhita dhulipala | టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య,శోభిత ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో శోభిత దూళిపాళ బర్త్‌డే రావడంతో ఇంకేముంది చైతూ ఆమె బర్త్‌డేని గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. గత ఏడాది డిసెంబర్లో వీరిద్దరి వివాహం కాగా, పెళ్లి తర్వాత నాగ చైతన్య, శోభిత మొదటి సారి బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య..శోభితకి ఊహించని గిఫ్ట్ అందించాడని తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఉన్న తన స్నేహితులతో కలిసి నైట్ పార్టీ కూడా జరపనున్నాడట. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండని నాగ చైతన్య తన భార్య బర్త్‌డేకి మాత్రం అదిరిపోయే పోస్ట్ పెట్టాడు.
శోభితతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే మై లేడీ అని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో నాగ చైతన్య హ్యాండ్సమ్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ పిక్ నాగ చైతన్య సెల్ఫీ తీయగా, శోభిత ఆయన భుజం పై తల పెట్టుకుని ఉంది. ప్రస్తుతం ఈ సెల్ఫీని మోస్ట్ రొమాంటిక్ సెల్ఫీ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక శోభిత బర్త్ డే అని తెలిసి అక్కినేని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా శోభితకి పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు. గతంలో శోభిత పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసి అదరగొట్టింది.
అయితే పెళ్లి తర్వాత కాస్త స్లో అయింది. ఇక శోభిత వచ్చిన వేళా విశేషం ఏంటో కాని నాగ చైతన్య తండేల్ రూపంలో పెద్ద హిట్ కొట్టాడు. ఈ చిత్రం చైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కాగా, సమంతతో విడిపోయిన తర్వాత కొన్నాళ్ల వరకు నాగ చైతన్య సోలోగానే జీవితాన్ని గడిపాడు. అయితే ఆ సమయంలోనే శోభితతో పరిచయం ఏర్పడింది. నాగ చైతన్య తనను ఫాలో అవుతున్నాడు అని తెలిసి ఆశ్చర్యపోయిన శోభిత తిరిగి ఫాలో అవ్వడం మొదలు పెట్టింది. ఇద్దరి మధ్య చాటింగ్ మొదలై, ఆ తర్వాత మీటింగ్స్ వరకు వెళ్లింది.ఒకరి భావాలు ఒకరికి నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి డిసెంబర్ 4న వివాహం చేసుకున్నారు.