BRS denmark | కేసీఆర్ దూరదృష్టితో బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ : బీఆర్ఎస్ డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ ఆకుల
brs denmark | సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యం చేసిన పార్టీగా బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు బీఆర్ఎస్ డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ ఆకుల . బీఆర్ఎస్ ఆలోచనా విధానం.. ప్రజలే కేంద్రబిందువు, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, స్వయం సమృద్ధి తెలంగాణ అనే భావనలపై ఆధారపడిందని పేర్కొన్నారు.
BRS denmark | తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గదర్శకంగా నిలిచిన మహానేత, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ ఆకుల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు. అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఆశయాలకు ప్రతిరూపం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఉద్యమాన్ని విజయవంతంగా రాష్ట్ర సాధనగా మార్చిన రాజకీయ శక్తి బీఆర్ఎస్ పార్టీ అని శ్యామ్ ఆకుల తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రైతు కేంద్రీకృత పాలనకు నాంది పలికింది అని.. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యం చేసిన పార్టీగా బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. బీఆర్ఎస్ ఆలోచనా విధానం.. ప్రజలే కేంద్రబిందువు, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, స్వయం సమృద్ధి తెలంగాణ అనే భావనలపై ఆధారపడిందని పేర్కొన్నారు.
కేసీఆర్ దూరదృష్టి, రాజకీయ నైపుణ్యం వల్లే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ ఆకుల మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించింది. ఆయన ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతతో బీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ పనిచేస్తుందన్నారు. ఈ శుభసందర్భంగా కేసీఆర్కు దీర్ఘాయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమై తెలంగాణ ప్రజల సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.
Read Also :
KU |తెలంగాణ అస్థిత్వ శిఖరం కేసీఆర్.. కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Veenavanka | వీణవంకలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Errabelli Dayakar Rao | పోలీసుల ఓవరాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి : వీడియో
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

