Viral Video : హ్యూమనాయిడ్ రోబోలంటే అచ్చం మనుషుల్లాగే ఉంటాయి. వాటి నడక, మాట, పనులు వంటివి దాదాపు మనిషిని పోలి ఉంటాయి. మన దేశంలో ఇంకా ఇలాంటివి పూర్తిగా అందుబాటులో లేకపోయినా చైనా, జపాన్ వంటి దేశాల్లో వీటి హవా నడుస్తోంది. ఇవి అనేక రంగాల్లో మనుషుల స్తానాన్ని ఆక్రమిస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు చైనాలో కొన్ని హ్యూమనాయిడ్ రోబోలు చేసిన డ్యాన్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అచ్చం మనుషుల్లాగే డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేశాయి. చైనాలో ఇటీవల 2026 స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా నిర్వహించారు. ఈ వార్షిక ఈవెంట్లో అనేక కళా ప్రదర్శనలు జరిగాయి. వాటిలో హ్యూమనాయిడ్ రోబోలు చేసిన ఆర్ట్ పర్ఫామెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్షల్ ఆర్ట్స్ దగ్గరి నంచి డాన్స్ వరకు అదరగొట్టేశాయి. అందులో కొన్ని రోబోలు స్టేజిపై చేసిన డాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోబోల డ్యాన్స్ చూసిన వాళ్లు ఔరా అంటున్నారు.
🤯Absolutely insane. Unitree’s humanoid robot team’s performance at the 2026 Spring Festival Gala
The significance of the humanoid robot’s performance lies in letting 1.4 billion Chinese people know where the future lies. pic.twitter.com/6vXIX2MfWM
— CyberRobo (@CyberRobooo) February 16, 2026
మనుషులకు ఏమాత్రం తీసిపోకుండా, ప్రొఫెషనల్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాయి ఈ రోబోలు. యునిట్రీ రోబోటిక్స్ సంస్థ ఈ ప్రదర్శన ఇచ్చింది. ఈ సంస్థ తయారు చేసిన జీ1, హెచ్2 హ్యూమనాయిడ్ రోబోలు వూబోట్ తరహా ప్రదర్శన ఇచ్చాయి. అయినా, ఆ డ్యాన్స్ గురించి ఎక్కువగా చెప్పడం ఎందుకు.. మీరే చూసేయండి.