KCR Birthday | జహీరాబాద్, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన మహానేత కేసీఆర్ అని సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కేసీఆర్ ప్రాణత్యాగాలకు సిద్ధమై ఉద్యమాన్ని నడిపారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలకు సిద్ధమై, తన్ను తాను మరిచి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డల ఆకాంక్షలను తన ఊపిరిలో మోసుకెళ్లిన గొప్ప నాయకుడు అన్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ కల అసాధ్యం అని అనుకున్న సమయంలో, ఉద్యమాన్ని ఆ దిశగా మార్చిన గొప్పనాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జైళ్లు, నిర్బంధాలు, అవమానాలు ఎదుర్కొని కూడా వెనకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో అనేక చారిత్రక నిర్ణయాలను తీసుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి చారిత్రక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. తెలంగాణ అంటే పేదరికం కాదు, తెలంగాణ అంటే అభివృద్ధి, గౌరవం, ఆత్మవిశ్వాసం అని దేశానికి చాటి చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, మాజీ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, మాజీ పట్టణ అధ్యక్షుడు మొహియుద్దీన్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, జహీరాబాద్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు స్వప్న ప్రవీణ్ కుమార్, ప్రేమలత శంకర్ రెడ్డి, బిల్లిపురం పాండు, గౌస్ గౌరీ, ఎర్రోళ్ల దీపక్, విజయ రాజు, ప్రవీణ్ జహా యాకూబ్ , జాకీర్, స్రవంతి రవికిరణ్, అన్నపూర్ణ అశోక్ షేరి, జాహేద్, సుజిత విశ్వేశ్వర్, పర్వీన్ బేగం అబ్దుల్లా, పెద్ద భాయ్ మహిపాల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
KU |తెలంగాణ అస్థిత్వ శిఖరం కేసీఆర్.. కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Veenavanka | వీణవంకలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Errabelli Dayakar Rao | పోలీసుల ఓవరాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి : వీడియో