Sekhar Kammula | అందమైన ప్రేమ కథలని చాలా హృద్యంగా చూపిస్తారు శేఖర్ కమ్ముల .. ఆయన తీసిన సినిమాలని ఎన్నిసార్లు చూసిన బోర్ అనే ఫీలింగ్ కలుగదు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు ప్రేక్షకులకి ఎలాంటి వినోదం పంచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలలో ఏదో ఒక సందేశం మనం చూస్తూ ఉంటాం. సమాజంపై చెడు ప్రభావం కనిపించకుండా ఆయన చిత్రాలు తెరకెక్కిస్తారు. రాజీపడని ధోరణి వల్లే ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అవుట్ ఫుట్ నూటికి నూరు శాతం సంతృప్తిగా అనిపిస్తే తప్ప తర్వాతి దశకు వెళ్లరు.ఆనంద్ తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.
తన పాతికేళ్ల సినీ ఉత్సవాన్ని తనను ఇక్కడ దాకా వచ్చేలా చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరుపుకోవాలని కోరుకున్నాడు శేఖర్ కమ్ముల. ఈ క్రమంలోనే చిరు సమక్షంలోనే శేఖర్ కమ్ముల పాతికేళ్ల సినీ పండుగ జరగడం విశేషం. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇందులో చిరంజీవి పై ఉన్న అభిమానం ఎలాంటిదో చూపించాడు. టీనేజ్ లో చిరంజీవి గారిని ఒకసారి దగ్గరగా చూశాను.. ఈయనతో సినిమా తీయాలి అనే ఫీలింగ్ ఉండేది.. ఆ ఫీలింగ్ తోనే ఇండస్ట్రీకి వచ్చా.. ఐతే పాతికేళ్ల ఉత్సవాన్ని సెలబ్రేట్ చేద్దామని మా టీం అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే.
కొన్ని జనరేషన్స్ ఇన్ స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. ఛేజ్ యువర్ డ్రీమ్స్, సక్సెస్ ఫాలో అనే నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే. అందుకే పాతికేళ్ల జర్నీ సెలబ్రేషన్ ఆయన ప్రజన్స్ లో జరుపుకోవాలని అనిపించింది.. థాంక్ యు సార్ అంటూ రాసుకొచ్చారు శేఖర్ కమ్ముల. మెగా అభిమానం చూసి ఆడియన్స్ అంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం మంచి హిట్ కావడం ఖాయం అంటున్నారు.