చెన్నై: తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ ఈ విషయాన్ని తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 97.37 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు ఆమె వెల్లడించారు. సర్ ప్రక్రియ చేపట్టడానికి ముందు తమిళనాడులో సుమారు 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండేవార్నారు. ఈసారి కొత్తగా 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న సుమారు 7.40 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈవో తెలిపారు. ఈ రోజు నుంచి ఓటర్ల జాబితా అప్డేట్ ప్రక్రియ ప్రతి రోజు జరుగుతుందని ఆమె వెల్లడించారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఓటర్లలో 2,77,38,925 కోట్ల మంది పురుషులు, 2,89,60,838 కోట్ల మంది మహిళలు, 7,617 వేల మంది థార్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.