Allu arjun | ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం (World No Tobacco Day) జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు ప్రజలకు పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పొగాకుపై అవగాహన కల్పిస్తూ.. ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
వరల్డ్ టోబాకో డేని పురస్కరించుకొని.. ధూమపానం చంపేస్తుంది. దయచేసి పొగాకు తాగడం మానేయండంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో బన్నీ బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించగా.. దీనిపై Smoking Kills అని రాసి ఉంది. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రం దాదాపు రూ.500 బడ్జెట్తో తెరకెక్కబోతుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా “పుష్ప 2” తర్వాత అల్లు అర్జున్ కు, “జవాన్” తర్వాత అట్లీకి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.
#WorldNoTobaccoDay . Pls don’t smoke 🚭 pic.twitter.com/ONcVVt5Typ
— Allu Arjun (@alluarjun) May 31, 2025