Puja to Transformer | ట్రాన్స్ఫార్మర్కు పూజ చేసిన గ్రామస్తులు.. ఎందుకంటే?
Puja to Transformer | విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత కొన్ని రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పూజలు చేశారు.
భోపాల్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో గత కొన్ని రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కొత్త ట్రాన్స్ఫార్మర్కు పూజలు చేశారు. (Puja to Transformer) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భిండ్‌లోని గాంధీ నగర్ ప్రాంతంలో 15 ఏళ్ల నాటి పాత విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇటీవల కాలిపోయింది. దీంతో మండే వేసవిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు గత 15 రోజులుగా ఇబ్బందిపడ్డారు.
కాగా, కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు గురించి విద్యుత్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు విసిగిపోయారు. చివరకు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా కరెంట్ లేక ఇబ్బంది పడిన స్థానికులు దీనిని పండుగలా జరుపుకున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్కు పూజలు చేయడంతోపాటు హారతి ఇచ్చారు. స్థానికులకు స్వీట్లు పంచిపెట్టారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ చాలా కాలం పని చేయాలని దేవుడ్ని ప్రార్థించారు.
మరోవైపు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దానిని మార్చేందుకు 15 రోజులకుపైగా పడుతుందని, అలాగే విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సి ఉంటుందని స్థానికులు వాపోయారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా చాలా ఏళ్లు పని చేసేందుకు కొత్త ట్రాన్స్ఫార్మర్కు పూజ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
కారుపై వర్షం నీరు చిమ్మినందుకు.. వ్యక్తి వేలు కొరికిన మరో వ్యక్తి
మరింత ఆకర్షణీయంగా.. వాట్సాప్ స్టేటస్ కోసం నాలుగు సరికొత్త ఫీచర్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhind
- Madhya Pradesh
- people
- puja
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

