మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 19:26:49

ఢిల్లీలో నల్లా బిల్లుల మాఫీ పథకం మరో మూడు నెలలు పొడిగింపు

ఢిల్లీలో నల్లా బిల్లుల మాఫీ పథకం మరో మూడు నెలలు పొడిగింపు

న్యూఢిల్లీ: నల్లా బిల్లుల మాఫీ పథకాన్ని ఢిల్లీ వాటర్‌ బోర్డు మరో మూడు నెలలు పొడిగించింది. కరోనా నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ పథకం సెప్టెంబర్‌ 30తో పూర్తవుతుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల ఇప్పటి వరకు ఈ పథకాన్ని వినియోగించుకోనివారు కూడా తాజా పొడిగింపుతో లబ్ధి పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు మంగళవారం అధికార ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో తాగునీటి వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బిల్లుల మాఫీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు అధికార ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ ఛాడా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన చెప్పారు. 

 logo