46% మంది అమెరికన్ల మద్దతు.. పీపుల్స్ సే పోల్‌లో వెల్లడి
లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 11: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్) అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో 46 శాతం మంది కోరుకొంటున్నారు. పీపుల్స్సే అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. డ్వేన్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడు కావాలని మీరు కోరుకొంటున్నారా అన్ని ప్రశ్నించగా.. 46 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. పోల్‌లో 30,138 మందిని ప్రశ్నించారు. ఈ పోల్‌ను డ్వేన్ జాన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ‘ఒక వేళ నేను అమెరికా అధ్యక్షుడిని అయితే అది ప్రజలకు సేవచేయడానికి లభించిన అవకాశంగా, గౌరవంగా భావిస్తాను’ అని అన్నారు. తనకు అమెరికా అధ్యక్ష పదవిపై ఉన్న ఆశను డ్వేన్ జాన్సన్ గతంలోనూ బయటపెట్టారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు 2017లో చెప్పారు.