గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!
గొంతునొప్పి | గొంతు నొప్పి అనేది సాధారణంగా మనకు తరచూ వస్తూనే ఉంటుంది. ఇక సీజన్ మారినప్పుడు కూడా గొంతు నొప్పి వచ్చి మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది.

గొంతు నొప్పి అనేది సాధారణంగా మనకు తరచూ వస్తూనే ఉంటుంది. ఇక సీజన్ మారినప్పుడు కూడా గొంతు నొప్పి వచ్చి మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్, మంట, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందులు అన్నీ దీంతో వస్తాయి. అయితే ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టేందుకు ఇంట్లో ఉండే పలు సహజ సిద్ధ పదార్థాలు చాలు. అందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అక్లర్లేదు. ఈ క్రమంలో గొంతు నొప్పిని ఎఫెక్టివ్‌గా తగ్గించుకునేందుకు ఏం చేయాలో ఏయే పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. ఆయా సమస్యలకు చికెన్ సూప్ ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు జలుబు ఉన్నా పోతుంది.
లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసుకుని వేడి వేడిగా తాగాలి. ఈ మసాలా టీతో గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నా పోతాయి.
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో చిక్కని అల్లం రసం వస్తుంది. అప్పుడు ఆ రసాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్షణాల్లో తగ్గుతుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెలను కలుపుకుని తాగాలి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. జలుబు కూడా తగ్గుతుంది.
మిరియాలతో చేసిన చారు, లేదంటే మిరియాలు వేసి మరిగించిన పాలను తాగుతుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా మాయమవుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

