Godavari river : మహారాష్ట్ర (Maharastra) లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది (Godavari river) ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ (Nashik) పట్టణంలో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో ఉప్పొంగి పరుగులు తీస్తోంది. పట్టణంలోని పంచవటి (Panchavati) లో రామాలయం పాక్షికంగా మునిగిపోయింది.
పంచవటిలో అత్యంత పురాతనమైన లక్ష్మణ సమేత సీతారాముల ఆలయం ఉంది. పురాతన కాలంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఆ ప్రాంతంలో పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నారని, అగస్త్య ముని సలహా మేరకు వారు అక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. పంచవటిలోని రామాలయం గోదావరిలో పాక్షికంగా మునిగిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Nashik, Maharashtra: Water level of Godavari river in Panchvati rises following heavy rainfall. pic.twitter.com/pk8aKos17d
— ANI (@ANI) July 6, 2025