Sonam Raghuvanshi : మేఘాలయ (Meghalaya) హనీమూన్ ట్రిప్‌లో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) ని వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘాజీపూర్ (Ghazipur) జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం మేఘాలయ పోలీసులు ఆమెను తదుపరి దర్యాప్తు కోసం మేఘాలయకు తీసుకెళ్లనున్నారు.
సోనమ్ రఘువంశీ తన భర్త హత్యకు గురైన 18 రోజుల తర్వాత సోమవారం తెల్లవారుజామున ఘాజీపూర్‌లోని ఓ దాబా వద్దకు చేరుకుని పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు ఆమెను ఘాజీపూర్‌లోనే ఓ ఇంట్లో నిర్బంధించారు. అనంతరం మేఘాలయ నుంచి ఓ పోలీస్ బృందం ఘాజీపూర్‌కు చేరుకుంది. సోనమ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించింది. పరీక్షల అనంతరం ఆమెను మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు తీసుకెళ్లనున్నారు.
రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23 నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్ జాడ తెలియలేదు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఆమె ఘాజీపూర్‌లో లొంగిపోయింది. దాంతో సోనమే కిరాయి హంతకులతో తన భర్తను హత్య చేయించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
#WATCH | Raja Raghuvanshi murder case: Sonam Raghuvanshi brought to District Hospital in Ghazipur, Uttar Pradesh
4 people have been arrested in this case. Of these, 3 have been identified as Akash Rajput, Vishal Singh Chauhan and Raj Singh Kushwaha. https://t.co/ot8yL8kiuG pic.twitter.com/7w9hWbpSF4
— ANI (@ANI) June 9, 2025