Road accident : ఈ మధ్య కాలంలో స్కూల్ బస్సులు (School buses) ప్రమాదాలకు గురికావడం అనేది ఎక్కువగా జరుగుతోంది. సుశిక్షితులు కాని వ్యక్తులు డ్రైవింగ్ చేస్తుండటం, స్కూళ్ల యాజమాన్యాలు ఖర్చును తగ్గించుకోవడానికి కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తుండటం, డ్రైవర్లపై టైమ్ ప్రెజర్ ఈ ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా హర్యానా (Haryana) లోని కైతాల్ (Kaital) లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది.
వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలవురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాంతో వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలువలో నీళ్లు కొద్దిగా మాత్రమే ఉండటంతో పెనుముప్పు తప్పిందని అన్నారు.
#WATCH | Haryana: Several children injured after a school bus fell into a canal in Kaithal. pic.twitter.com/RgkAxEp65r
— ANI (@ANI) February 17, 2025
Devendra Fadnavis | తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.. Video
MLC Kavitha | కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు.. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు.. Video
Satara | భారీగా ట్రాఫిక్ జాం.. పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్కు వెళ్లిన విద్యార్థి
Mysuru | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా..?
Peddagattu Jatara | ఒ లింగా.. ఓ లింగా.. భక్త జనసంద్రంగా పెద్దగట్టు