Robert Vadra : ఇవాళ కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పుట్టినరోజు. ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రియాంకాగాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) పేదలకు అన్నదానం చేశారు. న్యూఢిల్లీలో తన నివాసం దగ్గర ఆయన భండారా (అన్నదానం) నిర్వహించారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు.
అయితే ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రియాంకాగాంధీ కనిపించలేదు. రాబర్ట్ వాద్రా పేదలకు అన్నదానం చేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారాలకే పరిమితమైన ప్రియాంకాగాంధీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బరిలో దిగి ఘన విజయం సాధించారు. లోక్‌సభలో తన తొలి ప్రసంగంలోనే ఔరా అనిపించారు.
అన్నదానం అనంతరం రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. పేదలకు స్వయంగా భోజనం వడ్డించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరూ తమ భోజనాన్ని ఆస్వాదించారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ లోహ్రీ శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. ప్రియాంకాగాంధీ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టడంతో దేశంలోని చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వాయనాడ్ ప్రజలు ప్రియాంకను ఆశీర్వదించి పార్లమెంట్ పంపారని అన్నారు.
#WATCH | Delhi: Businessman Robert Vadra says, “I am very happy to serve people from all walks of life…Everybody enjoys the meal…I also extend best wishes to everyone on the occasion of Lohri. People from across the nation are rejoicing as she (Congress MP Priyanka Gandhi… https://t.co/cDDxpKMXQC pic.twitter.com/s2smu9VHmI
— ANI (@ANI) January 13, 2025
#WATCH | On the occasion of the birthday of Congress MP Priyanka Gandhi Vadra, her husband and businessman Robert Vadra organised a ‘bhandara’ in Delhi. pic.twitter.com/jiOEysBSz3
— ANI (@ANI) January 13, 2025
Student suicide | ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థి ఆత్మహత్య
Offer | బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కంటే.. మధ్యప్రదేశ్ బోర్డు వినూత్న ఆఫర్..!
Kho Kho World Cup | నేటి నుంచే ఖో ఖో ప్రపంచకప్.. భారత్ తొలిపోరు ఎవరితో అంటే..!
Z-Morh Tunnel | సోన్మార్గ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవీ టన్నెల్ ప్రత్యేకతలు
Maha Kumbh | యూపీ సర్కారుకు కాసులు కురిపించనున్న మహాకుంభమేళా.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?
Stock markets | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం