Shashi Tharoor : ఇవాళ (సోమవారం) లోక్‌సభ (Lok Sabha) లో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించనున్నారు. చర్చ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi), ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఎంపీలంతా పార్లమెంట్‌కు వచ్చారు. వివిధ పార్టీల ఎంపీలు ఒక్కొక్కరు వస్తుండగా మీడియా ప్రతినిధులు పార్లమెంట్ ఆవరణలో ఆపరేషన్ సింధూర్‌పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను కూడా మీడియా ప్రతినిధులు అభిప్రాయం అడుగగా ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘మౌనవ్రతం, మౌనవ్రతం’ అని చెప్పుకుంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. శశిథరూర్ తాను మౌనవ్రతంలో ఉన్నానని మాటల్లో చెప్పడంతో.. ఆపరేషన్ సింధూర్ చర్చపై స్పందించకుండా తప్పించుకునేందుకే ఆయన అలా చేశారని మీడియా ప్రతినిధులు గ్రహించి నవ్వుకున్నారు.
శశిథరూర్ మీడియా ప్రతినిధులకు చమత్కారంగా సమాధానం చెప్పిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి. థరూర్ హాస్య చాతుర్యాన్ని చూసి మీరూ ఒకసారి నవ్వుకోండి..
#WATCH | Delhi | Lok Sabha to discuss Operation Sindoor today, Congress MP Shashi Tharoor says, “Maunvrat, maunvrat…” pic.twitter.com/YVOwS7jpk5
— ANI (@ANI) July 28, 2025