Heavy rain : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని తికమ్గఢ్ (Tikamgarh) ఏరియాలో కుండపోత వర్షం (Heavy rain) కురిసింది. కేవలం 48 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో తికమ్గఢ్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఏరియాలోని చెరువులు, రిజర్వాయర్లో నిండిపోయాయి.
‘గడిచిన 48 గంటల్లో తికమ్ గఢ్లో మొత్తం 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతో ఏరియాలోని చెరువులు, డ్యామ్లు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది. సమాచారం అందగానే మేం ప్రజలను అప్రమత్తం చేశాం. ఈ భారీ వర్షాలవల్ల ఎలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోలేదు. నాలాలా ఆక్రమణలవల్లే వరదనీరు ఎక్కడికక్కడ నిలిచింది’ అని తికమ్గఢ్ జిల్లా కలెక్టర్ వివేక్ శ్రోట్రియా చెప్పారు.