Tejashwi Yadav : ప్రముఖ వ్యాపారి గోపాల్ ఖేమ్కా (Gopal Khemka) హత్య ఘటనను మరువకముందే బీహార్ (Bihar) రాజధాని పట్నా (Patna) లో మరో వ్యక్తి హత్యకు గురికావడంపై.. ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ (RJD) కీలక నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా..? అని ప్రశ్నించారు. వరుస హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు.
‘వ్యాపారి గోపాల్ ఖేమ్కా హత్య ఘటనను మరువకముందే పట్నాలో ఇప్పుడు బీజేపీ నేత హత్యకు గురయ్యారు. దీనిపై ఏం చెప్తారు.. ఎవరికి చెప్తారు..? అసలు రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారులో ఏ ఒక్కరైనా నిజం తెలుసుకోవడానికి, తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..?’ అని తేజస్వి ప్రశ్నించారు. సీఎం ఆరోగ్యం గురించి అందరికీ తెలుసని, కానీ ఇద్దరు పనికిరాని బీజేపీ డిప్యూటీ సీఎంలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.