ఇండియన్ వెల్స్: ప్రపంచ నంబర్ 2 ర్యాంకు టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (పోలండ్)కు ఇండియన్ వెల్స్‌లో షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఇగా.. 2-6, 6-4, 4-6తో తొమ్మిదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేతిలో కంగుతింది. టాప్ సీడ్ సబలెంకా.. 7-6 (7/0), 6-4తో విక్టోరియా (కెనడా)పై గెలిచింది.
సీడ్ రిబాకినా (కజకిస్థాన్).. 6-1, 7-6 (7/4)తో జెస్సికా పెగులా (యూఎస్)ను చిత్తుచేసింది. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ సంచలనం అల్కరాజ్.. 6-3, 6-4తో బ్రిటన్ ఆటగాడు కామెరూన్ నూరీపై ఏకపక్ష విజయంతో లాస్ట్-4 చేరాడు. సిన్నర్ (ఇటలీ).. 6-1, 6-2తో లర్నర్ టైన్ (యూఎస్)పై ఈజీ విక్టరీ సాధించాడు.