హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు చేతులురాని రేవంత్‌రెడ్డి సర్కార్ ఆడంబరాలకు మాత్రం లక్షలు వెచ్చిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారుల ఫర్నీచర్ల కోసం కోట్లకు కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నది. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే ప్రజాభవన్‌లోని ఒక హాల్లో కేవలం కర్టెన్ల ఏర్పాటు కోసం రూ.38,84,500 వెచ్చిస్తున్నది.
ఇందుకు ఆర్అండ్బీ శాఖ తాజాగా పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. అదే హాల్లో ప్రజావాణి అధికారులకు సంబంధించిన క్యాబిన్ల నిర్మాణం కోసం అదనంగా మరో రూ.73 లక్షలు మంజూరు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.