కోల్‌కతా: ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటిన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్బనీకి జాక్‌పాట్! ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్-19వ సీజన్లో అతడు మూడుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడనున్నాడు.
ఈ మేరకు ఫ్రాంచైజీ శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ జింబాబ్వే బౌలర్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడాల్సి ఉన్నా అతడు ఆ టోర్నీ నుంచి వైదొలిగి, ఐపీఎల్లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధమయ్యాడు. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ లేని లోటును ముజార్బనీ తీరుస్తాడని కేకేఆర్ భావిస్తున్నది.