Flood situation : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రాజస్థాన్ (Rajastan) రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్ (Sawai Madhopur) నగరంలో కూడా గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆ నగరంలోని మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి.
లోతట్లు ప్రాంతాల్లో ఇండ్లు, వీధిలో నీట మునిగిపోయాయి. దాంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయం కల్పించారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు, విపత్తు నిర్వహణ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో సహాయక చర్యలు అంతరాయం ఏర్పడుతోంది.
#WATCH | Rajasthan | Flood situation in Sawai Madhopur, following torrential rain in the city pic.twitter.com/iug83FxWCg
— ANI (@ANI) August 23, 2025