Chaitanya Baghel : లిక్కర్ కుంభకోణం (Liquer scam) కేసులో అరెస్టయిన చైతన్య బఘేల్ (Chaithanya Baghel) కు రాయ్‌పూర్ కోర్టు (Raipur court) 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఐదు రోజుల ఈడీ కస్టడీ (ED custody) నేటితో ముగియడంతో అతడిని కోర్టులో హాజరుపర్చారు. మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దాంతో కోర్టు అందుకు అనుమతించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు చైతన్య బఘేల్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 6న జరగనుంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడైన చైతన్య బఘేల్‌కు లిక్కర్ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. ఇవాళ్టితో అతడి ఐదు రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు రాయ్‌పూర్ కోర్టులో హాజరుపర్చారు. నిందితుడిని రెండు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు అందుకు అనుమతించింది.